మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబు, కేశవరెడ్డి, గండ్ర నళినితో పాటు ఇంకొందరు ఓయూ ఐకాస నేతలు బీజేపీలో చేరబోతున్నారు. శామీర్ పేటలోని ఆయన నివాసం నుంచి శంషాబాద్ వెళ్లిన ఈటల.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు.