ఏపీలో ఈనెల 16నుంచి స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయని సీఎం జగన్ సహా మంత్రులంతా ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే దాదాపుగా అన్ని జిల్లాల్లో స్థానిక లాక్ డౌన్ అమలవుతోంది. చాలా చోట్ల మధ్యాహ్నం వరకే కర్ఫ్యూ సడలింపులు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సందర్భంలో అసలు స్కూల్స్ తెరవడం సాధ్యమేనా, స్కూల్స్ తెరిస్తే.. లాక్ డౌన్ ఎత్తేయాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.