హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయానికి బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. ఓ దశలో అందర్నీ సంజయ్ కలుపుకొని వెళ్తారనుకున్నా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్ర చేసిన కిషన్ రెడ్డి, ఒకరకంగా తాను కూడా తెలంగాణలో ప్రధాన పోటీదారుగా ఉంటానని చెప్పకనే చెప్పారు. కిషన్ రెడ్డి, సంజయ్ మాత్రమే కాదు.. తెలంగాణ పార్టీపై పెత్తనం కోసం మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం.