బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ ఉప ఎన్నికకోసం ఇన్ చార్జిగా నియమించారు. మండలాల వారీగా ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అందులోనూ దివంగత నేత వెంకట సుబ్బయ్య భార్య సుధ ఇక్క అభ్యర్థిగా వైసీపీ తరపున బరిలో దిగుతున్నారు. ఆ సింపతీ ఓట్లు కూడా ఆమెకే వస్తాయి. ఎలా చూసుకున్నా ఇక్కడ మెజార్టీ భారీగా పెరగాలని, అదే సమయంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోవాలనేది జగన్ ఆలోచన. దానికి తగ్గట్టుగానే కాస్త ముందుగానే ఆయన అన్నీ సెట్ చేస్తున్నారు.