ప్రముఖ దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ ల కలయికలో వచ్చిన రోబో సినిమాను ఏవరైనా మర్చిపోతారేమో కానీ, దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం మర్చిపోకుండా ఉండలేకపోతున్నాడని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.
నిజమే త్రివిక్రమ్ కు రోబో సినిమా ఇచ్చిన షాక్ అలాంటిది మరి. మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా త్రివిక్రమ్ రూపొందించిన ఖలేజా చిత్రం ఎన్నో అంచనాలతో విడుదల అయింది, అయితే అదే సమయంలో రోబో సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. దీంతో జనాలు అందరూ అటువైపే మొగ్గు చూపారు, ఖలేజాకు పరాజయం తప్పలేదు. ఇప్పడు ఇలాంటి స్థితే మళ్లీ జులాయికి ఎదురయింది. జులాయి విడుదల చేద్దాం అనుకునే సమయానికి ఈగ హైస్పీడ్ తో సాగుతుంది. పైగా ఈగ కూడా రోబోలానే గ్రాఫిక్స్ ప్రధానంగా రూపుదిద్దుకుంది.
మహేష్ బాబు అండ ఉండగానే రోబో చేతిలో దెబ్బతిన్న త్రివిక్రమ్ ఇప్పడు అల్లు అర్జున్ సహయంతో ఈగను దాటలేడనే అభిప్రాయంతోనే జులాయిని వాయిదా వేసాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి