ఎవరు బోల్తా కొట్టిస్తే పోలీస్ మైండ్ బ్లాక్ అవుద్దో వాడే సైకోసాంబా.ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది పచ్చినిజం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోలీసుల ప్రస్తావన వస్తే చాలు వారి మద్య ఇదే హాట్ టాపిక్. అలాగని సినిమా డైలాగ్ లేదు అనుకోవద్దు.పోకిరి సినిమాలో పవర్ హీరో మహేశ్ బాబు కొట్టే పవర్ ఫుల్ డైలాగ్ గుర్తుకువస్తుంది. అదే ఎవడు ‘కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండు‘ అది సినిమా కాబట్టి అందరు ఎంజాయ్ చేశారు. కాని ఇది నిజం అందుకే భయంతో హడలిపోతున్నారు జనం ఎనిమిది జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయంతో గజగజ వనికేలా చేస్తున్నాడు గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాంతానికి చెందిన సైకో సాంబశివరావ్. ఎవరి ఒంటిపై వాడి చేయి ఎప్పుడు పడుతుందో తెలియదు. మెడ తెగుతుందో,వేలు కోసుకుపోతుందో..లేక వాని ఉన్మాదచర్యలకు ప్రాణాలేపోతాయో. ఎందుకంటే ఆసైకో ఈదుర్మార్గపు పనులన్నీ చేస్తూ పోలీసులకు దొరకకుండా హడలెత్తిస్తన్నాడు. ఎనిమిది జిల్లాల పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో గత కొంత కాలంగా నిద్రాహారాలు మాని గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇక హాయిగా ఉండొచ్చు అని అనుకున్న ఆనంద క్షణాలు అంతలోనే ఆవిరయ్యాయి. ఇదీ...నేరాల అదుపులో,నేరస్తులను కటకటాల్లోకి పంపించడంలో ఘనతవహించిన మన పోలీసులు చేసిన నిర్వాక పలితం. అనుకున్నది ఒకటి,అయింది ఒకటి బోల్తా పడ్డారు లేవోయి మన పోలీసోళ్లు...అన్నట్లు ఒకేఒక్కడు ఎందరో పోలీసోల్లను బురిడి కొట్టించి బుడతలా మాయమయ్యాడు ఒకేఒక్కడు సైకోసాంబ.దోచుకున్న బంగారాన్ని దొంగ చూపిస్తానంటే చెప్పిన చోటికి తీసుకువెల్లడం మన పోలీసులకు అచ్చొచ్చిన విద్య. ఇప్పుడూ అదే చేశారు,కాని ఇక్కడ దొంగ ప్లేసులో ఉన్నది ఉన్మాది అన్న విషయాన్ని మరచిపోయారు. అలా అని సామాన్య జాగ్రత్తలేం తీసుకోలేదు సుమా...అసాధారణ భద్రత చర్యలు తీసుకున్నారు.అవే మన పోలీసుయంత్రాంగాన్ని అభాసుపాలు చేసింది. ఇద్దరు సి.ఐ.లు, నలుగురు ఎస్.ఐ.లు, అంతకు తగ్గ సంఖ్యలో సాయుధులైన పోలీసులు వెంట వెల్లి బంగారం దాచిన క్రిష్ణా జిల్లా కొండపల్లి ఖిల్లా ప్రాంతానికి సైకోసాంబాను తీసుకువెల్లారు. ప్రాంతం గూర్చి తెలిసికూడా దానికి చుట్టూరా ఎటువైపు పారిపోకుండా ఏర్పాట్లు చేసుకోలేదు. ఎందుకంటే పప్పులో కాలేయడం కూడా మన పోలీసులకు వెన్నెతో పెట్టిన విద్య అన్న విషయం కూడా అందరికి తెలియాలి అనుకున్నారేమో.ఏఆయుధమూ లేని ఒక్కడు అంతమంది సాయుధులైన పోలీసులను బోల్తాకొట్టంచి పారిపోయాడు. సైకోసాంబాని అప్పటికే మూడురోజుల నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈసంధర్బంగా తామిచ్చిన ట్రీట్ మెంట్ కు సాంబ ఇక ఏసాహసం చేయలేడు అనుకున్నారు. ఎందుకంటే కరడుగట్టిన తీవ్రవాదులు కూడా ఒకసారి మన పోలీసు కస్టడీలో ఒకరోజు ఉన్నా కుదేలవుతారాయే. ఈవిషయంలో ఇంత ఘనమైన పేరు తెచ్చుకున్న మనపోలీసులు ఆరికార్డును నిలుపులేకపోయారా... లేక మన పోలీసుల సత్తా సైకోసాంబాకు సరిపడా లేదా... ఈరెండింటిలో ఏది నిజమో పోలీసులకే తెలియాలి. కాని సైకోసాంబా షాట్ తో ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్న గుణపాఠం మాత్రం మన పోలీసులు నేర్చుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: