గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు అడవిబిడ్డలను వణికిస్తున్నాయి. తొలకరి జల్లులు కురియగానే గిరిజన ప్రాంతాల్లో రోగాల భయం వెంటాడుతుంది. అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నటువంటి గిరిజనులు రోగాలు సోకితే కిలోమీటర్ల వరకు కాలినడకన ఆసుపత్రి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నివాసప్రాంతాలు మురుగునీటితో కలుషితం కావడంతో రోగాలు ప్రభలిపోతున్నాయి. వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ వంటి జిల్లాల్లోని ఏజేన్సి ప్రాంతాల్లో మలేరియా, డయేరియా, మెదడువాపు, డెంగ్యూ, విషజ్వరాలు ప్రభలి అనేకమంది గిరిజన పుత్రులు రోగాలు బారిన పడుతున్నారు. రోగాల బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం దగ్గరలో లేక పోవడం, రవాణ సౌకర్యం లేకపోవడంతో కొంత మంది ఆసుపత్రికి వెళ్లలేక చికిత్స అందే లోపే చనిపోతున్నారు. గత సంవత్సరం వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గిరిజర ప్రాంతాల్లో డెంగ్యూ, డయేరియా, మెదడువాపు, విషజ్వరాల కేసులు మూడు వేల వరకు నమోదయ్యాయి. కాగా ఇందులో 300మంది చనిపోయారు. గిరిజనులను పట్టి పీడిస్తున్నటువంటి రోగాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా ఈసంవత్సరంలో కూడా వర్షాలు కురియడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోగాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం తెలియక, వాహన సౌకర్యం లేక పోవడంతో రోగులను మంచాలపై, కావడీలపై తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ముందుచూపుగా రోగాలు రాకుండా అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలున్నాయి. గత సంవత్సరంలోనే దోమలు, ఈగలు కుట్టకుండా దోమతెరలను అందిస్తామని ప్రభుత్వం హామినిచ్చినప్పటికిని నామమాత్రంగా కొంత మందికి సరఫరా చేసి చేతులు దులుపుకోవడంతో దోమలు, ఈగల వల్ల అనేక మంది రోగాల బారిన పడి చికిత్స అందక చనిపోతున్నారు. ఇప్పుడున్నటువంటి వర్షాల సీజనులో ప్రభుత్వం రోగాలు ప్రభలకుండా చర్యలు తీసుకోకపోతే అడవి ప్రాంతాల్లో మరికొంత మంది అడవి పుత్రులు రోగాలకు గురయ్యే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: