హైదరాబాద్: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు చుక్కెదురైంది. చంద్రబాబు ఆస్తుల విషయమై విచారాణకు ఆదేశించాలంటూ వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ఇరువర్గాల వాదనల్ని విన్న తరువాత సోమవారం నాడు విజయమ్మ పిటీషన్ను కొట్టివేసింది. బాబు ఆస్తులకు సంబంధించి సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించింది. విజయమ్మ వేసిన పిటీషన్ను అత్యున్నతమైన న్యాయస్థానం కొట్టివేయడంతో బాబుకు ఊరట దొరికింది.
మరింత సమాచారం తెలుసుకోండి: