ఇంటర్నెట్. ప్రస్తుతం దేశంలో ఈ పేరు వినని వారు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. చాలా మంది ఇళ్లలో ఇంటర్నెట్ వాడకం సర్వసాధారణమై పోయింది. మనదేశంలోకి నెట్ వచ్చి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. దేశంలోని మారుమూల పల్లెల్లోకి సైతం చొచ్చుకుపోతోంది. నెట్ తో ఎన్నో లాభాలు ఉన్నా.. నష్టాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి సుమా. ముఖ్యంగా ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మనకు ఉదయం లేవగానే కంప్యూటర్ తోనే పని. కంప్యూటర్ లేకపోతే కాలమూ గడవదు. పనులు పూర్తికావు. కాగా సైబర్ నేరాల్లో సోషల్ నెట్ వర్క్, బ్యాంకు ఆన్ లైన్ అకౌంట్స్ లో తదితర ఆర్థిక అంశాలపైనే ఎక్కువగా మోసపోతుంటారు. సోషల్ వెబ్ సైట్ లలో సైన్ ఇన్ ఇవ్వడం, హాబీ. వీటిలో దిన చర్యలను పోస్టింగ్ చేయడం, వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకపొవడంతో ముప్పు తప్పదు. అంతేకాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వెబ్ సైట్ లలో అపరిచిత వ్యక్తులు చొచ్చుకుపోయి మరీ పోస్టింగ్ చేస్తున్నారు. బ్యాంకు ఆన్ లైన్ అకౌంట్స్ తోనూ ఏటీఎం నుంచి డబ్బు డ్రాచేసే సమయంలోనూ ఇలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ మెయిల్ హ్యాకింగ్, బ్యాంకు ఖాతా ఫిషింగ్, క్రెడిడ్ కార్డు స్నిన్నింగ్, (కార్డు సమాచారం తెలసుకొన వాటి ద్వారా క్లోనింగ్ కార్డులు తయారు చేయడం, వాటి ద్వారా షాపింగ్ చేయడం, బ్యాంకు అకౌంట్లకు సంబంధించి ఆన్ లైన్ ట్రాన్ జక్షన్ చేసేటప్పుడు అకౌంట్ దారుని పాస్ వర్డ్, పిన్ నెంబర్లు, ఫిషింగ్ ద్వారా తస్కరించడం జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: