రాష్ట్రకాంగ్రేస్ లో పవర్ కోసం జరుతున్న వార్ పతాకస్థాయికి చేరుకుంది.ఇన్నాళ్ళు చాపకింద నీరులా జరిగిన యుద్దం ఒక్కసారిగా బద్దలై ఇరువురు అగ్రనేతల మద్య చిచ్చు రాజేసింది. వీరిలో సిఎం సీటులో కూర్చున్నవారు ఒకరు కాగా ఈసీటును ఆశిస్తున్న నేత మరొకరు. అధికార పీఠాల్లో,పార్టీ పదవుల్లో ఇక మార్పులు తథ్యం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈలొల్లి పెద్దది కావడం,ఇన్నాళ్లు తలో గ్రూపును మేంటేన్ చేస్తూ పవర్ కోసం పాకులాడిన వారు కూడా ఒక్కసారిగా తలోవైపుకు వెల్లి ఆఇరువురు నేతల్లో ఒకరి పంచన చేరి రెండు గ్రూపులుగా తయారు కావడం కూడా రాష్ట్రంలో పవర్ మార్పు పక్కాగా జరిగే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తోంది. అయితే మారిన కాంగ్రేస్ సమీకరణలు కొన్ని కొత్త విషయాలకు సంకేతాలు ఇస్తున్నాయి. సిఎం రేసులో ఉన్నవారు కూడా తలోదిక్కుకు మారిపోయి సిఎం, జైపాల్ వర్గాల్లో కలిసి వారిలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారు. చివరి వరకు కూడా పదవుల కోసం కొట్టుకు చచ్చే సాంప్రదాయం ఉన్న కాంగ్రేస్ లో సడన్ గా వచ్చిన ఈమార్పు కచ్చితమైన సంకేతాలేవో అధిష్టానం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా పార్టీనేతలెవరు బయటకు చెప్పకపోతున్నా కొంత సమాచారం మాత్రం బయటకు పొక్కింది. ఇప్పుడు సిఎంను మారిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మందిని మార్చి ప్రజల్లో చులకన అవుతామన్న ఆలోచనే కాకుండా విపక్షాలు కూడా ఎవరు ఎన్నాళ్లు పాలిస్తారో తెలియని పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అధోగతిపాలవుతుందని,దీని గూర్చి వేరే చెప్పక్కర్లేదని ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అంటూ ప్రజల్లోకి వెలితే ప్రమాదమని కూడా అధిష్టానం భావిస్తోందట. అంతేగాక సిఎం కిరణ్ ఇప్పటి వరకు జగన్ ను గాని, వైకాపాను కాని అంతగా విమర్శించడం లేదు. ఆయనే జగన్ కు పెద్దకోవర్టు అంటూ కూడా సొంతపార్టీవారు కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన వర్గీయులుగా ఉన్నవారు కూడా ఎక్కువ శాతం జగన్ పాటపాడే వారే ఎక్కువ, అంటే ఈఆరోపణల్లో నిజం ఎంతో కొంత ఉందన్నమాట.సీటు మార్చిన మరుక్షణం జగన్ పార్టీలోకి భారి వలుసలు జరిగితే పార్టీ నిలువునా చీలుతుందన్న భయాన్ని కూడా అధిష్టానం కలిగిఉన్నట్లు తెలుస్తోంది. సిఎం దూకుడు స్వభావం కూడా ఇది నిజమేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. మార్చకపోతే సిఎం మాట ఖాతరు చేయని మంత్రులను మార్చాలి. పార్టీపదవుల్లోని ముఖ్యులను మార్చాలి,పైగా తెలంగాణ లొల్లి పార్టీలో మరింత ఎక్కవవుతుంది. ఇది పార్టీని మరింత ఇబ్బంది పెడుతుందన్న ఆందోలన కూడా అధిష్టానంలో ఉందట. దీనిని అదిగమిస్తూ పార్టీని ఇరుప్రాంతాల్లో కాపాడుకోవాలంటే సీనియర్, ఇరుప్రాంతాల నేతల మద్దతు ఎక్కువ ఉన్న జైపాల్ రెడ్డిని సిఎం చేయాలన్నది కూడా అధిష్టానం ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంటే పదవులకోసం ఇతరులెంత మంది అరచి గీ పెట్టినా కూడా అవి వచ్చే అవకాశాలు లేవని, ఏదైనా జరిగితే సిఎం సీటులోకి జైపాల్ రెడ్డి రావడమో,లేదా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగడమో జరుగుతుందని అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు మారిన మన నేతల తీరు తెలుపుతోంది. ఎవరో ఒకరివైపు చేరితే,వారు జైకొట్టిన వారికి అధికారం ఉండడమో,దక్కడమో జరిగితే మిగిలిన పదవులు కొట్టేయొచ్చని అన్ని గ్రూపులు రద్దు చేసుకుని రెండుగా మారిపోయారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: