వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శాంతియుతంగా పని చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన జగన్, చంద్రబాబు పరిపాలన తీరును సునిశితంగా వివరించారు. 2014 తరువాత చంద్రబాబు , 2019లో వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక కలెక్టర్లతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే..చాలా వ్యత్యాసం ఉందన్నారు.


ప్రజలకు మనం సేవలకులమని వైయస్‌ జగన్‌ చెబితే.. చంద్రబాబు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని, తన పార్టీ నేతలకు మేలు చేసేలా వ్యవస్థలను వాడుకున్నారని బొత్స అన్నారు. పేకాట క్లబ్‌లు, సంఘ విద్రోహ శక్తులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వమన్నారే తప్ప..చట్టానికి వ్యతిరేకంగా పని చేయవద్దని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సీఎం ఆలోచన బట్టే రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్నారు.


ఈ సందర్భంగా బొత్స చంద్రబాబు పాలనను గుర్తు చేశారు. ఆ రోజు చంద్రబాబు దోపిడీ అనే విధానాన్ని ఎంచుకొని నియంతలా పరిపాలించారన్నారు. వైయస్‌ జగన్‌ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారని వివరించారు. ఎవరి పరిపాలన ఏటో? ఎవరి విధానం ఏంటో తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు , వైయస్‌ జగన్‌ ఉపన్యాసాలను ఒక్కసారి గమనించాలన్నారు.


జగన్ మూడు నెలల పాలన గురించి బొత్స మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. మేనిఫెస్టోకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. భగవంతుడు కూడా కరుణించాడన్నారు. వర్షాపాతం తక్కువైనా..ఎగువ నుంచి వరద నీరు రావడంతో జలాశయాలు నిండాయన్నారు. ఎక్కడా కూడా పబ్లిసిటికి తావులేకుండా పనులు చేస్తున్నామన్నారు. ఇంత శాంతియుతంగా రాష్ట్రం ఉంటే చంద్రబాబు ఓర్వలేక, రాక్షస తాలుకా ఆలోచనతో చంద్రబాబు, ఆయన అనుచర గణం అల్లరి సృష్టించేందుకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు.


చంద్రబాబు జిమ్మిక్కులు ఆపాలని.. ఇదేనా మీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని బొత్స ప్రశ్నించారు. పాత ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, వైయస్‌ జగన్‌ కొత్త ఆలోచనలతో పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు పాత ఆలోచనలు పోయాయన్నారు. మా ప్రభుత్వం ఒక సద్దుదేశ్యంతో ముందుకు వెళ్తుందని, చంద్రబాబు లాంటి కుటిల మనస్తత్వంతో చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: