హైదరాబాద్: రాష్ర్ట మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి మళ్లీ చిక్కుల్లో చిక్కుకున్నారు. వరుస కష్టాలతో పార్థసారధి కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల ముందు ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే దానిపై సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఇప్పటికే రాష్ర్ట ఎన్నికల సంఘం అధికారులు విచారించి కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదికను పంపించారు. పార్థసారధి తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని పొందపర్చారనే అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది. ఇదే గనుక నిజమైతే పార్థసారధి మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఫారిన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ యాక్టు(ఫెరా) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు రుజువు కావడంతో రాష్ర్ట మంత్రి పార్థసారధికి నాంపల్లిలోని ఆర్థిక నేరాల కోర్టు 5.25లక్షల జరిమాన, రెండు నెలల శిక్ష విధించిన విషయం విధితమే. కోర్టు పార్థసారధికి శిక్షను ఖరారు చేయడంతో ఆయన మంత్రి పదవీకి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ డిమాండు చేసింది. నాంపల్లి కోర్టు శిక్షను వేసినప్పటికీ పై కోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటును కలిపించింది.  తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జరిగిన విచారణలో అఫిడవిట్ లో లోపాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దీనితో పార్థసారధి రాజకీయ భవిష్యత్ పై కొంత అయోమయం నెలకొంది. మంత్రి పదవీపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఏది ఏమైనా 1994నాటి కేపీఆర్ సంస్థకు సంబంధించిన స్విడ్జర్లాండ్ లో యంత్రాల కొనుగోలు ఒప్పందంలో బ్యాంకులు తనను ఇబ్బందులకు గురిచేశాయనీ పార్థసారధి తెగ బాధపడుతున్నారు.  ఏమైనా పార్థసారధి మంత్రి పదవీని త్యజించడం ఖాయమనే అందరూ అనుకుంటున్నారు. ఎన్నికల ముందు ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో లోపాలున్నట్లు తేలింది. దాంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారికి ఎన్నికల సంఘం ఆదేశించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: