క్షేత్ర స్థాయిలో వైసీపీ బలం పెరుగుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా బలంగా ఉన్నా సరే వైసీపీకి క్యాడర్ తక్కువ అనేది వాస్తవం. కాంగ్రెస్ నుంచి వైసీపీ ఏర్పడటంతో ఆ పార్టీలో ఉన్న వైఎస్ అభిమానులతో బలం పుంజుకుంది వైసీపీ. వారే పార్టీకి అన్నీ తామై వ్యవహరించారు ముందుండి నడిపించారు. అయితే బూత్ లెవెల్ స్థాయిలో మాత్రం పార్టీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమని రాజకీయ పరిశీలకులతో పాటు వైసీపీ నేతలు కూడా అంగీకరించారు. ఆ వ్యూహాలే వైసీపీని గెలుపు తీరాలు చేర్చాయి.

 

రాజకీయంగా నేడు ఆ పార్టీ అధికార పరంగా ఎక్కువగా బలంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకుంటారు అనే పేరున్న జగన్ పాలన విషయంలో కూడా నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల్లో సంక్షేమ పథకాలపై ఎక్కువ సానుకూలత ఉంది అనేది వాస్తవం. దీనితో క్యాడర్ లో కూడా ఒక నమ్మకం వస్తుంది. వాలంటీర్ ఉద్యోగాలు అందరికి రావడంతో యువతలో నమ్మకం ఏర్పడింది.  దాదాపు ప్ర‌తి గ్రామంలోనూ ప‌ది మందికి ఉద్యోగాలు రావ‌డంతో యువ‌త‌లో ఎక్క‌డా లేని జోష్ నెల‌కొంది. 

 

దీనితో ఇప్పుడు పార్టీ క్షేత్ర స్థాయిలో బలం పుంజుకుంటుంది. కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అందే దశలోనే ఉన్నాయి. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఆర్ధిక వ్యవస్థ మీద వచ్చినా పథకాల అమలు విషయంలో జగన్ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు అధికార పార్టీని బలపరుస్తుంది. ప్రజల్లో కూడా జగన్ పై సానుకూలత పెరుగుతుంది. ఇచ్చిన మాట తప్పరు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. దీనిని జగన్ వినియోగించుకోవడం విజయవంతం అయ్యారనే చెప్పాలి. అందుకే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అనేది వేగంగా జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: