మహిళలపై అత్యాచారాలు, హత్యలపై ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత జీవన్ రెడ్డి తెలిపారు. తాజాగా  హైదరాబాద్ లో  నిర్వహించిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను కడిగివేసుకోవడానికే నిందితులను ఎన్ కౌంటర్ చేశారని విమర్శించడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలు, పాపాలకు ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదని, దిశ తల్లిదండ్రులు సంప్రదించినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు అని తెలిపారు.

 

పోలీసులు కేవలం అధికార పార్టీ నేతల సేవలకు మాత్రమే ఉన్నట్లు అని పిస్తుంది  జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, పోలీస్ నిర్లక్ష్యానికి ఈ ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆరోపణలు చేయడం జరిగింది.  ఇక రాష్ట్రంలో మద్యం ఆదాయ మార్గంగా ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుందని విమర్శల వర్షం కురిపించారు.

 

Image result for ఎమ్మెల్సీ <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JEEVAN' target='_blank' title='జీవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్</a> రెడ్డి

 

దళితులు, బలహీన వర్గాలకు చెందిన మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలియచేయడం జరిగింది. దిశ సంఘటన తో పాటు అన్ని కేసులపై  స్వతంత్ర విచారణ సంస్థ సిట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిని. దిశా కేసు కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కాకుండా శాశ్వత ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం చాలా మంచిది అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది అని తెలియచేయడం జరిగింది.

 

ఇకనైనా కేసీఆర్ పాలనలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. మద్యం నియంత్రణ కోసం కేసీఆర్ ఆలోచన చేయాలని జీవన్ రెడ్డి కోరడం జరిగింది. కేసీఆర్ కు హాట్సాప్ చెప్పిన  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తెలంగాణ లో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఆర్టీసీ చార్జీలు కేసీఆర్ పెంచారని, దానికి కూడా జగన్ హాట్సాప్ చెబుతారా అని ప్రశ్నించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: