ఏపీ అసెంబ్లీ పంచ్ డైలాగులతో మారుమోగుతోంది. అసెంబ్లీలో చంద్రబాబు, జగన్ మధ్య ఇంగ్లీష్ మీడియం విషయంలో వాదన జరిగిన సమయంలో మంత్రి కన్నబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. తనకు మీడియా లేదని.. టీవీ లేదని చంద్రబాబు అన్నారు. ఈనాడు పత్రిక తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఉందని.. కానీ సాక్షి పత్రికను కేవలం రాజకీయాల కోసం జగన్ పెట్టారని విమర్శించారు.

 

చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. సాక్షి పత్రికకు విశ్వసనీయత ఉందా.. అది ఒక పేపరా.. అదో చెత్త పేపర్.. వేస్ట్ పేపర్ అంటూ చిందులేశారు. సాక్షి పత్రికా.. మీరూ ఒకటి కాదా.. కాదని చెప్పలగలరా అంటూ మాట్లాడారు. మీ పత్రికలో తప్పుడు వార్తలు ఇచ్చినందుకు మీరు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

 

ఈ సమయంలో మంత్రి కన్నబాబు స్పందించారు. చంద్రబాబు మా పార్టీకి పేపర్‌ లేదంటున్నారు. చానల్‌ లేదంటున్నారు. వండుకున్నామేకు ఒక్క కూర, దండుకున్నామేకు పది కూరలు అన్న సామెత ఉందని ఎద్దేవా చేశారు.. మాకు సాక్షి పేపర్‌ ఒక్కటే ఉందన్నారు.

 

కానీ చంద్రబాబుకు ఎన్ని పత్రికలు, ఎన్ని చానల్స్‌ మద్దతు ఇస్తున్నాయో అందరికి తెలుసు అంటూ వెటకాలం ఆడారు. చంద్రబాబు మేడిన్‌ మీడియా, వైయస్‌ జగన్‌ మేడిన్‌ పబ్లిక్‌..ఇది వారిద్దరికి ఉన్న తేడా అంటూ పంచ్ డైలాగ్ వదిలారు. కన్నబాబు పేల్చిన పంచ్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: