ఏపీలో ఇప్పుడు రాజధాని మార్పు అనివార్యంగా మారింది. ఏమీలేని అమరావతిలో లక్షల కోట్లు పోయలేమని.. సంక్షేమం కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం కాబట్టి.. లక్షల కోట్లు అమరావతిలో పెట్టే స్తోమత రాష్ట్రానికి లేదని జగన్ సర్కారు తేల్చిచెప్పింది. అందుకే ఇప్పటికే నగరంగా ఉన్న విశాఖలో రాజధాని పెట్టాలని నిర్ణయించింది. అయితే ఒక రాష్ట్ర రాజధానిని మార్చడం అంటే చాలా పెద్ద నిర్ణయం.

 

మరి అంతటి నిర్ణయాన్ని జగన్ సులభంగా అమలు చేసే సాహసం చేస్తున్నారు. ఇందుకు మూల కారణం చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పలే కారణమని అగ్రశ్రేణి ఆంగ్ల పత్రిక తన కథనంలో విశ్లేషించింది. చంద్రబాబు చేసిన తప్పులే అమరావతికి శాపంగా మారాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన తప్పుల వల్లే ఇప్పుడు జగన్ కు ఇంత ధైర్యం వచ్చిందని ఆ విశ్లేషణలో తెలిపింది. చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులను ఆ కథనం ఏకరువు పెట్టింది.

 

రాష్ట్ర విభజన వేళ.. హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. చంద్రబాబు పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే హక్కు ఉన్నా.. దాన్ని వినియోగించుకోలేదు. పైగా దానిపై హక్కులను వదలుకుని అమరావతి కొత్త పేరుతో రాజధానిని ప్రకటించారు. అది కూడా క్రమ పద్దతిలో చేయలేదు.. పార్లమెంటులో అమరావతికి పార్లమెంటు నుంచి ఆమోదం పొందడానికి ప్రయత్నించలేదు. పదేళ్లు రాజధాని గా హైదరాబాద్ అని పార్లమెంటు విభజన చట్టంలో ఆమోదం తెలిపడం వల్ల అమరావతికి పార్లమెంటు ఆమోదానికి వెళ్లలేదు.

 

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా... అమరావతిని కేంద్రం నోటిఫై చేసేలా కూడా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ అంశం రాష్ట్రం పరిధిలోనే ఉందని నిపుణులు చెబుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. అంటే చంద్రబాబు తప్పులే అమరావతి ఉసురు తీశాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: