రోజురోజుకూ టెక్నాలజీ  పెరుగుతుంది... మరోవైపు కాలుష్యం తీవ్రంగా... ఒకవైపు పని ఒత్తిడి కూడా రోజురోజుకు బాగానే పెరిగిపోతున్నాయి... అంతేకాదండోయ్ ఈ రోజుల్లో రోజురోజుకు బట్టతల కూడా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా బట్టతలలు  దర్శనమిస్తూనే ఉన్నాయి  ఈ రోజుల్లో. చిన్న వయసులోనే బట్టతలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. బట్టతలతో బాధపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. బట్ట తలతో బాధపడే వారు... వారి ముందు ఎవరైనా సరికొత్త హెయిర్ స్టైల్ తో స్టైల్ గా కనిపించారంటే లోలోపల కుమిలిపోతుంటారు. బట్టతల అనేది వారికి ఒక లోపం  లాగా భావిస్తూ ఉంటారు. బట్టతలతో  బాధపడేవారు చాలా మందే ఉన్నారు. 

 

 

 

 ఇక బట్టతల వస్తున్న వారు వెంట్రుకలు ఊడి పోకుండా ఉండేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఏం చేసిన  ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మెడిసిన్స్ వాడిన బట్టతల రాకమానదు. ఇక వచ్చిన తర్వాత దాని కోసం బాధ పడక మానరు. అయితే బట్టతల రావడానికి ముఖ్య కారణం పని ఒత్తిడి పెరిగిపోతుండటం కాలుష్యం పెరిగి పోవటం  ఎక్కువగా ప్రోటీన్లు లేని ఆహారం తీసుకుంటూ ఉండటం వల్ల బట్టతల ఎక్కువగా వస్తుందని వైద్యులు సూచిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా బట్టతల వస్తుందని చెబుతూ ఉంటారు. ఏదేమైనా నేటి తరాన్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య బట్టతల. బట్టతల కనిపించకుండా ఉండేందుకు లక్షలు లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడరు చాలామంది. 

 

 

 అయితే హైదరాబాద్ నగరంలో బట్టతల ఓ యువకుడి ప్రాణం బలిగొంది. కొండాపూర్ లో ఉండే 18 ఏళ్ల యువకుడికి జుట్టు రాలి పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇంటర్ పూర్తి చేసిన ఆ యువకుడికి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో చిన్న వయసులోనే బట్టతల వచ్చిందని మనోవేదనకు గురయ్యాడు ఆ యువకుడు. బాధతో బాత్రూంలో సోమవారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టతల రావడమే తన  ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు ఆ యువకుడు .

మరింత సమాచారం తెలుసుకోండి: