రిపబ్లిక్ డే అంటే ఎందుకు జరుపుకుంటారు... 1950 జనవరి 26వ తేదీన ఎంతోమంది మేధావులు 11 నెలలకు పైగా కష్టపడి ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల  నుంచి ముఖ్య విషయాలను సేకరించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా  భారత రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేసిన రోజు కనుక ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు సహా  స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా... జనగనమన పాడి తో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి వందనం చేసి గౌరవిస్తూ ఉంటారు. భవిష్యత్తు తరాలకు స్వతంత్రం అందించడం కోసం ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. 

 

 

 కానీ గణతంత్ర దినోత్సవ లో అక్కడక్కడ అపశ్రుతులు  నెలకొంటూ ఉంటాయి. అధికారుల నిర్లక్ష్యంతో త్రివర్ణ పతాకాన్ని సరిగా ఎగురవేయకపోవడం...  చిరిగిపోయిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం లాంటివి  జరుగుతూ ఉంటాయి. అయితే గణతంత్ర దినోత్సవం నాడు మరో తప్పిదం జరిగింది. ఇది  పొరపాటున జరిగినది కాదు ఒక వ్యక్తి కావాలని చేసి భారత జాతీయ జెండాను అవమానించాడు. అతను కూడా వేరే దేశం వారు అనుకునేరు.. ఒక భారతీయుడు జనవరి 26వ తేదీన భారత జాతీయ జెండా ఆయన త్రివర్ణ పతాకాన్ని కాల్చివేశాడు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. 

 

 దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటే.. మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి జాతీయ జెండాను తగలబెట్టి సంచలనం సృష్టించాడు. కురవి మండలం తిరుమలాపురం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగురవేయగా... సర్పంచ్ లేకుండానే జాతీయ జెండాను ఎలా  ఎగుర వేస్తారు అని హల్ చల్ చేసిన  సర్పంచ్ బంధువు... అందరూ చూస్తుండగానే జాతీయ జెండాకు నిప్పంటించి తగులబెట్టాడు. దీంతో స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా జిల్లావ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: