ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా  వైరస్ భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఏ పని చేయాలన్నా కరోనా ఎక్కడ సోకుతుందో అని  వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చైనాలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 1500 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా 65 వేల మందికి పైగా కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక భారతదేశంలో కూడా ముగ్గురు కరోనా  బాధితులు ఉన్నట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు. 

 

 అయితే కరోనా  వైరస్ ఎఫెక్టుతో  ప్రస్తుతం కొన్ని అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. చికెన్ తింటే కరోనా  వైరస్ వస్తుందని  అంటూ పలు ప్రసారాలు ఊపందుకున్నాయి. అయితే  అధికారులు చికెన్ తింటే ఏమీ కాదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఈ అపోహ మాత్రం పోలేదు.దీంతో  చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. కరోనా  భయంతో చికెన్ తినడాన్ని తగ్గించేశారు ప్రజలు. చికెన్ తినడానికి తగ్గించిన ప్రజలు మటన్ పైన ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో మటన్ కి కూడా భారీగా రేట్లు ఉండడంతో చికెన్ తినలేక మటన్ కొనలేక.. మాంసం లేకుండా ఉండలేక నీరసపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు మటన్ షాప్ వ్యాపారులు  వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నారు.  

 

 ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నందిగామ లోనే మటన్ వ్యాపారులు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. ఐదు కేజీలు మటన్ కొనుగోలు చేసిన వారికి ఒక హెల్మెట్ ఇస్తున్నారు మటన్ వ్యాపారులు . ఈ మధ్య కాలంలో  వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీన్ని తగ్గించేందుకు తమ వంతు సహకారం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కృష్ణా జిల్లాలోని నందిగామ పాత బస్టాండ్ లోని  మటన్ షాప్ వ్యాపారి  వినూత్న ఐడియా తో ముందుకొచ్చాడు. 5 కిలోల మటన్ కొంటే  500 రూపాయల విలువైన హెల్మెట్ ను బహుమతిగా ఇస్తున్నాడు. దీంతో అటు వినియోగదారులు కూడా మటన్  కొనేందుకు ఆసక్తి చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: