తల్లా పెళ్లామా చిత్రంలో నందమూరి హరికృష్ణ బాలనటుడిగా పాడిన పాట బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది.. తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది..  నిజంగానే బ్రహ్మంగారు ఒకప్పుడు తన కాలజ్ఞానంలో రాసినవి జరుగుతున్నాయని పలు సంఘటనలు రుజువు చేశాయి.  అయితే ఇది నిజం అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు.  కాదు అంతే బోగట్ట అనే వారు కూడా అంతేమంది ఉన్నారు.  ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న వింత సంఘటనలు ఒకప్పుడు మహామేధావులు ముందే ఉహించినవి అయి ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. 

 

తాజాగా ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కరోనా వైరస్ గురించి అప్పట్లో కోరంగి వ్యాధి ప్రబలుతుందని దాని వల్ల కోటి మంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు.  అయితే చైనాలో వ్యాపించిన కరోనా వ్యాధి వల్ల ఇప్పుడు 2000 వేలకు పైగా మరణించారు.  80 వేలకు పైగా వ్యాధి భారిన పడ్డారు.  దేశ వ్యాప్తంగా ఇంకా ఎన్నో మరణాలు సంబవిస్తున్నాయి.   ఈ ఎఫెక్ట్ తో భారత్ లో కూడా ఒక మరణం సంభవించింది.  కరోనా ఇప్పుడు కోరియా దేశానికి పాకింది.  కోవిడ్‌-19 తో యూరప్‌లో తొలి మరణం సంభవించింది. కరోనా వైరస్‌ పాజిటీవ్‌ ఉన్న 78 ఏళ్ల వఅద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటలీలో మఅతి చెందాడు. 

 

ఇప్పటి వరకు చైనాలో ఈ వైరస్‌తో 2,360 మందికి పైగా మఅతి చెందారు. 78 వేల మందికిపైగా కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. మరోవైపు చైనాలోని జైళ్లను సైతం వదలడం లేదు కరోనా. జపాన్ నౌకలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మృతి చెందారు. డైమండ్‌ ప్రిన్సెస్‌2, జపాన్‌ 1, సౌత్‌ కొరియా 4, హాంగ్‌కాంగ్‌ 2, ఇటలీ 2, ఫ్రాన్స్‌ 1, ఇరాన్‌ 5, థైవాన్‌ 1, ఫిలిప్పీన్స్‌ 1, సింగపూర్‌ 1. భారతదేశంలోని మహారాష్ట్రలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచిన 77 మందికి కరోనా వైరస్‌ పరీక్ష నెగటివ్‌గా వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: