భారత్లో క్రికెట్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ భారత క్రికెట్ కు మాత్రం హాకీ  కంటే ఎక్కువ ప్రేక్షకాదరణ ఉంటుంది. అయితే ఈ ప్రేక్షకాదరణ ఇప్పటినుంచి ఉన్నది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి భారత క్రికెట్ కి ప్రేక్షకాదరణ ఉంది. అయితే భారత్లో పురుషులతో పాటు మహిళల జట్టు ఉన్నప్పటికీ పురుషుల జట్టుకు మాత్రమే ఎక్కువగా ప్రేక్షకాదరణ ఉండేది. కేవలం ప్రేక్షకులు పురుషుల క్రికెట్ ను మాత్రమే చూడడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి సమయంలో... భారత క్రికెట్ ప్రేక్షకులు చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు మళ్లేలా చేసింది భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. క్రికెట్ లో ఎదురులేని శక్తిగా ఎదిగింది. పురుషులతో మహిళలు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించి మహిళా శక్తిని చాటింది మిథాలీ రాజ్. 

 

 

 

 భారత మహిళా క్రికెట్ ను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఎంతో కృషి చేసింది. 1999లో వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్.. ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2002లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండుపై 264 పరుగులు సాధించి ప్రపంచంలోని క్రికెట్ ప్రేక్షకుల చూపు మొత్తం  మహిళా క్రికెట్ వైపు మళ్లేలా చేసింది సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక 2005లో ప్రపంచ కప్ ఫైనల్స్ లో  భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది మిథాలీ రాజ్. స్వతహాగా బ్యాటింగ్ తో అదరగొట్టే మిథాలీ రాజ్ అప్పుడప్పుడు తన బౌలింగ్ మెలకువలతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. ఇక 2005 సంవత్సరంలో అర్జున అవార్డును దక్కించుకుంది మిథాలీ రాజ్. 

 

 

 మిథాలీ రాజ్ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ నే మహిళా క్రికెట్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఒక్కసారిగా క్రికెట్ ప్రేక్షకుల చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు మళ్లేలా చేసింది. దీంతో బిసిసిఐ కూడా మహిళ క్రికెట్ పై  కాస్త శ్రద్ధ చూపడం మొదలు పెట్టింది. ఓ వైపు సారధ్య  బాధ్యతలను భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తూనే జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా  ఎన్నో విజయాలను అందించినది  మిథాలీ రాజ్. మొత్తం అంతర్జాతీయ క్రికెట్లో తొంబై ఐదు వన్డే మ్యాచ్లు ఆడిన మిథాలీ రాజ్.. 2776 పరుగులు చేసింది. ఇలా భారత మహిళ క్రికెట్ కు  ఆదరణ లేని సమయంలో కూడా... భారత క్రికెట్ ప్రేక్షకుల చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు మళ్లేలా చేసింది మిథాలీ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: