దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కాగా., శనివారం వరకూ 34 మందికి కరోనా సోకిందని తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారం మరో ఐదుగురికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దాంతో మొత్తంగా ఇండియాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 39కి చేరింది. ఇక రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితులను చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా టెన్షన్ లేకపోయినా.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మాత్రం కంగారు పడుతోంది. 

 

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరిన్ని క్వారంటైన్ ప్లేసెస్ (రోగుల్ని ఉంచే ప్రదేశాలు)ని గుర్తించమని సూచించారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే కుటుంబసభ్యులలో ముగ్గురు ఈమధ్యే ఇటలీ వెళ్లి వచ్చారు. ఆ ముగ్గురికీ కరోనా సోకింది. దీంతో మిగతా ఇద్దరికీ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్న దేశాల్లో చైనా, ఇరాన్ ఇటలీ కూడా ఉంది. అక్కడికి ఎవరైనా వెళ్లి వస్తే వాళ్లకు కరోనా సోకుతుంది. ఇప్పుడు ఆ ఐదుగురిని ఐసోలేషన్ వార్డుల్లో విడివిడిగా ఉంచారు. వైద్యుల పరిశీలన, పర్యవేక్షణ వారిపై కొనసాగుతోంది.

 

 

ఇంకా కేరళలోనే కాక.. తమిళనాడులో కూడా కరోనా వైరస్ ఒకరికి ఉన్నట్లు తేలింది. అయితే ఇతను ఒమన్ వెళ్లినట్లు తెలిపారు. ఇంకా లఢక్ నుంచీ ఇద్దరికీ కరోనా ఉంది. అయితే వీరు ఇరాన్ వెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితీ నిలకడగా ఉంది. దీన్ని బట్టీ మనకు అర్థమవుతున్నది ఒక్కటే. విదేశాలకు అది కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చే వారికి కరోనా వైరస్ సోకుతోంది.  

 

 

 

ప్రస్తుతం 95 దేశాల్లో లక్ష మందికి పైగా కరోనా వైరస్ సోకి బాధపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ వైరస్ వల్ల 3515 మంది చనిపోయారు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలిశాక కూడా మనంజాగ్రత్తగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కర్చీఫ్‌లు వాడటం, హ్యాండ్ శానిటైజర్లు వాడటం వంటి చర్యలు మంచివేనని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: