బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు, బీజేపీ నేత బైరెడ్డి శబరి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కనీసం నాలెడ్జ్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ వాడితే కరోనా పోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సీఎం మాటలు నమ్మి ప్రజలు ఆయన చెప్పిన వైద్యాన్ని అనుసరిస్తే వాళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైద్యురాలిగా సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. 
 
జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి బేస్ వర్క్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. టైఫాయిడ్, న్యుమోనియా ఎలానో కరోనా కూడా అలానే అని జగన్ చెబుతున్నారని ఆ వ్యాధులపై ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి వాటికి వ్యాక్సిన్ లను కనిపెట్టారని అన్నారు. ఆ వ్యాధుల వ్యాప్తి, మరణాల సంఖ్య తక్కువని కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉందో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. 
 
కరోనాను టైఫాయిడ్, న్యుమోనియోతో పోల్చడం సరికాదని అన్నారు. కరోనాకు పారాసిట్మాల్ వాడాలని దయచేసి తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ఆమె కోరారు. పారాసిట్మాల్ ట్యాబ్లెట్ ఒక ఆంటీ బయోటిక్ అని ఒళ్లు నొప్పులకు, జ్వరానికి వాడే మందు అని చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలలొ శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతాయని ఈ లక్షణాలు పారాసిట్మాల్ తో తగ్గుతాయా..? అని ప్రశ్నించారు. 
 
సీఎం హోదాలో ఉన్నవారు పారాసిట్మాల్ తో కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తే మన ఇళ్లల్లో ప్రజలు గుడ్డిగా నమ్మి పారాసిట్మాల్ ట్యాబ్లెట్ వాడతారని... వారి నుండి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. బ్లీచింగ్ పౌడర్ తో వైరస్ చచ్చిపోతుందా...? అని ప్రశ్నించారు. వైరస్ మీ కళ్లకు కనిపిస్తుందేమో కానీ నా కళ్లకు కనిపించటం లేదని సీఎంను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు అవగాహన తెప్పించాలని తప్పుడు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. ఇలాంటి సమాచారం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సీఎం పదవిలో ఉన్నవారు దాని గురించి స్టడీ చేసి మాట్లాడాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: