తెలంగాణ‌లో భ‌యంక‌ర‌మైన కోవిడ్ వైర‌స్ విజృంభిస్తోంది. క‌రోనా వైర‌స్ ఈ రాష్ట్రంలో ప్ర‌ధానంగా విస్త‌రించ‌డానికి విదేశాల నుంచి వ‌చ్చిన వారితోనే అన్న‌ది ఇప్ప‌టికే నిర్దార‌ణ అయ్యింది. తెలంగాణ‌లో స్థానికుల‌కు ఈ వైర‌స్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం విదేశీ వ్య‌క్తులే అన్న‌ది కేసీఆర్ ఇప్ప‌టికే నిర్దారించారు. ఇక ప్ర‌భుత్వంతో పాటు ఎంతో మంది ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయినా క‌రోనాకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. ఇక సోమ‌వారంతో ఇప్ప‌టికే 33 మందికి పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వ‌గా.. ఇప్పుడు మంగ‌ళ‌వారం మ‌రో ముగ్గురికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. దీంతో ఇక్క‌డ క‌రోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 36 కు చేరువైంది.



ఇక మంగ‌ళ‌వారం పాజిటివ్ రిపోర్టులు వ‌చ్చిన వారిలో జ‌ర్మ‌నీ నుంచి వ‌చ్చిన 39 ఏళ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. అలాగే సౌదీ నుంచి వ‌చ్చిన 61 ఏళ్ల మ‌హిళ‌తో పాటు లండ‌న్ నుంచి వ‌చ్చిన 49 ఏళ్ల వ్య‌క్తికి సైతం క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. స్థానికంగా కేసీఆర్ ప్ర‌భుత్వం లాక్ డౌన్‌ల‌తో పాటు క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా విదేశాల నుంచి వ‌చ్చే వారితోనే క‌రోనా బాగా స్ప్రెడ్ అవుతోంది.



ఇప్ప‌టికే తెలంగాణ చుట్టు ప‌క్క‌ల రాష్ట్రాల నుంచి వ‌చ్చే ర‌హ‌దారులు అన్నింటిని మూసి వేసింది. క‌ర్నాక‌ట‌, ఆంధ్రా, ఛ‌త్తీస్ ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మాసేసింది. అయినా విదేశాల నుంచి వ‌చ్చే వారితోనే ఈ స‌మ‌స్య ఎక్కువ అవుతోంది. ఇక ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే కేసీఆర్ లాక్ డౌన్‌ను ఏప్రిల్ 10వ తేదీ వ‌ర‌కు కూడా పొడిగిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా క‌రోనా దెబ్బ‌తో తెలంగాణ‌లో అటు ప్ర‌భుత్వానికి.. ఇటు వ్య‌వ‌స్థ‌ల‌కు క‌లిసి భారీ న‌ష్టం చేకూరంది. మ‌ళ్లీ ఇవ‌న్నీ ఎప్ప‌ట‌కి గాడిలో ప‌డ‌తామో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: