ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి కొన్ని ఆసక్తికరమై సంగతులు వెల్లడవుతున్నాయి. కరోనా వస్తే నూటికి 90 శాతం మంది బతుకుతారు.. కేవలం 10 శాతం మంది మాత్రమే హై రిస్కులో ఉంటారు. ఐసీయూలోకి వెళ్తారు. వారిలో 2-3 శాతం మంది మాత్రమే చావు వరకూ వెళ్తారు. అలాగని దీని గురించి పెద్దగా భయపడనక్కర్లేదని అనుకోవద్దు.

 

 

ఇప్పటికే కొన్ని జబ్బులు ఉన్నవారికి కరోనా చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారిలో సుగర్ జబ్బు ఉన్నవారు కూడా ఉన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ వృద్ధులకు అందులోనూ మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు గలవారికి మరింత ప్రాణాంతకమని చెబుతున్నారు. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారిలో 16-22% మంది సుగర్ పేషెంట్లే అని లెక్కలు చెబుతున్నాయి.

 

 

మనదేశంలోని లెక్కలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇంకో డేంజర్ విషయం ఏంటంటే.. షుగర్ వ్యాధి ఉన్నవారు వృద్ధులే కాదు.. ఎవరికైనా ఇది డేంజరే. షుగర్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా కరోనా ప్రమాదంగా మారే అవకాశముందట. మరి మనదేశంలో 7 కోట్ల మంది వరకూ షుగర్ పేషెంట్లు ఉన్నారు. సో వారందరికీ ఈ కరోనా ప్రాణాంతకమే అన్నమాట.

 

 

అసలే కరోనా విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. అందుకే కరోనా ఇన్‌ఫెక్షన్‌ మనదగ్గర ఎక్కువగా ప్రబలే అవకాశముంది. కాబట్టి షుగర్ పేషెంట్లు మరీ మరీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షుగర్ పేషెంట్లు గ్లూకోజు స్థాయులు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. హెచ్‌బీఏ1సీ 7% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గ్లూకోజు స్థాయిలు తగ్గితే పూర్తిగా కాకపోయినా కొంతయినా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: