తెలుగు తెరెపైన ఎదురులేని గ్లామర్ తారగా 90s లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా.. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఎదురులేని రాజకీయ నాయకురాలిగా.. ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న రోజా బుల్లితెర "జబర్దస్త్"కు జడ్జిగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన రోజా.. సదరు పార్టీ అధికారంలోకి  రావడంతో.. అప్పటివరకు వున్న ఐరెన్ లెగ్ అనే పేరుని తొలగించుకున్నారు.

 

ఇక ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం అప్పట్లో చాలా తీవ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమెను ఐరెన్ లెగ్ అన్న నోళ్లే, గోల్డెన్ లెగ్ అనడం ఆమె విజయానికి నిదర్శనం. ఇక ప్రజలకు సేవ చేయడంలోనూ, రోజా తన ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజ్రంభిస్తున్న తరుణంలో ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. 

 

తన భర్త అయిన ప్రముఖ దర్శకుడు, సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ సౌత్ ఇండియాకు అధ్యక్షుడిగా వున్న సంగతి అందరికి విదితమే. ఇటీవల ఆయన పేద కళాకారులను ఆదుకోవాలని పిలుపునివ్వడంతో చాలా మంది హీరోలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా రోజా కూడా పేద కళాకారుల నిమిత్తం... 100 బియ్యం బస్తాలను పంపిణీ చేసారు. 

 

అలాగే... త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలను కూడా ఆదుకునేందుకు రోజా, తమవంతు సాయంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి... ప్రముఖుల నుండి విరాళాలను సేకరించే పనిలో నిమగ్నమై వున్నట్లుగా.. సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాకుండా.. కరోనా ఉపద్రవాన్ని ఉద్దేశించి.. ప్రజలకు పలు రకాలైన సూచనలు చేస్తోంది. పరిశుభ్రత, క్రమశిక్షణ గురించి సోషల్ మీడియా వేదికగా ఆమె తన స్వరాన్ని వినిపిస్తూనే వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: