మన గురించి మనం జబ్బులు చరుచుకుకోవడం కాదు. మన గురించి ఎదుటి వాడు ఏమంటున్నాడో అదే అసలైన విషయం. ఇప్పుడు ఇది ఇండియా- చైనా సంబంధాలకు కూడా వర్తిస్తుంది. మన సోషల్ మీడియాలో గమనిస్తే.. కొన్ని రోజులుగా చైనాపై విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోంది. చైనా యే కరోనా వైరస్ సృష్టి కర్త అని.. దాన్ని తాను ప్రపంచ సూపర్ పవర్ అయ్యేందుకు ప్రపంచంపై వదిలిందనేది ఇందులో ఓ వాదన.

 

 

అలాగే చైనా వాళ్ల ఆహార అలవాట్లపైనా సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియాలోనూ విపరీతంగా కథనాలు వచ్చాయి. వారి ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ కరోనా వైరస్ పుట్టిందని జోరుగా కామెంట్లు వచ్చాయి. దీనికి తోడు చైనాను శత్రువుగా భావించడం కూడ మనవాళ్లకు అలవాటే. ఇది సరే.. మరి మన దేశం గురించి చైనా మీడియా ఏం రాసిందో తెలుసా..?

 

 

ఇండియాలో జనతా కర్ఫ్యూ పేరుతో ప్రధాని ఒక్క రోజు ప్రజల స్వచ్ఛంద కర్ఫ్యూపై చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. జనతా కర్ఫ్యూ ఆ తర్వాత లాక్ డౌన్ విధింపు తర్వాత ఏర్పడిన పరిస్థితులపైనా చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. మన పోలీసులు విస్తృతంగా లాఠీలు ఝుళిపించిన తీరుపై చైనా మీడియా విమర్శిచింది. ఇందేం పోలీసింగ్ అంటూ ఎత్తిచూపింది. అదే చైనాలో అయితే ప్రజలను ఎలా కట్టడి చేశామో వివరించింది. చైనాలో డ్రోన్లను వాడిన విషయం, ప్రజలను అదుపు చేయడంలో వాడిన ఆధునిక పద్దతుల గురించి రాసుకొచ్చింది.

 

 

ఇక మోడీ సర్కారుపైనా చైనా మీడియాలో విమర్శలు కనిపిస్తాయి. మోడీ కారణంగా భారత ఆర్థిక వృద్ధి మందగించిందనీ.. జీడీపీ ఘోరంగా తగ్గిందని.. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోడీ జాతీయ వాదాన్ని ప్రజల్లో రెచ్చగొడుతున్నాడని చైనా మీడియా రాస్తోంది. ఇదీ చైనా మీడియాకు ఇండియాపై ఉన్న అభిప్రాయం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: