కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను గుర్తించడం ఎలా.. ఇప్పుడు సమాజంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది. ప్రత్యేకించి జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కరోనా వచ్చిన వారిని గుర్తించకపోతే.. అది మరింత విస్తృతంగా వ్యాపిస్తుంది. చాలా చోట్ల.. తప్పనిసరిగా పని చేసే ఆఫీసుల్లోనూ.. బ్యాంకుల్లోనూ.. రోడ్లపైనా కరోనా వచ్చిన వారిని గుర్తించేందుకు థర్మల్ స్కానర్లను ఉపయోగిస్తున్నారు.

 

 

దీనిని ఉపయోగించడం చాలా తేలిక.. థర్మల్ గన్ లేదా థర్మల్ స్కానర్ ను ఎదుటి వ్యక్తి నుదుటిపై ఫోకస్ చేయగానే అతని టెంపరేచర్ ఎంతో తెలిసిపోతుంది. అది ఎబౌనార్మల్ గా ఉంటే.. జ్వరం ఉన్నట్టు తేలితే.. అతనిని కరోనా అనుమానితుడిగా గుర్తిస్తారు. అయితే చాలా మందికి ఈ థర్మల్ స్కానర్లు, థర్మో గన్ల ద్వారా కరోనా వచ్చిందో లేదో తెలిసిపోతుందని అపోహ పడుతున్నారు. ఈ థర్మో గన్లను విరివిగా వాడటం ద్వారా అలాంటి అభిప్రాయం కలుగుతోంది.

 

 

కానీ ఈ థర్మల్ స్కానర్లు కరోనా వచ్చిన రోగులందరినీ గుర్తించలేవు. ఎందుకంటే.. కరోనా సోకిన వ్యక్తి లక్షణాలు వెంటనే బయటపడవు. మరి వీటిని ఎందుకు వాడుతున్నారంటే.. కరోనా వచ్చిన రోగిలో ఆ లక్షణాలు బయటపడినప్పుడు మాత్రం ఈ థర్మల్ గన్ల ద్వారా గుర్తించవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే.. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ థర్మల్ స్కానర్లు గుర్తిస్తాయి. అలాగని జ్వరం ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా రోగి కావాలనిలేదు కదా.

 

 

కానీ.. అప్పటికే కరోనా వచ్చి ఉంటే.. ఆ లక్షణాలు బయటపడి ఉంటే.. రోగికి కచ్చితంగా జ్వరం వస్తుంది. కాబట్టి.. కరోనా రోగుల్లో దాదాపు 30-40 శాతం మందిని ఈ థర్మల్ స్కానర్ల ద్వారా గుర్తించవచ్చు. అందువల్ల ఈ థర్మల్ స్కానర్లు ఉపయోగం కొంత వరకే. అయితే ఎంతో కొంత బెటర్ కదా అనే ఉద్దేశ్యంతోనే ఈ థర్మల్ స్కానర్లను వాడుతున్నారు. అంతే తప్ప.. ఈ థర్మల్ స్కానర్లు కరోనాను గుర్తిస్తాయనుకుంటే అది అపోహ మాత్రమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: