భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడ కరోనా విపత్తు రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో నిన్న ఒక్కరోజునే కరోనా కు సంబంధించి 826 కొత్త కేసులు నమోదు అయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మళ్ళీ 50 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో ఈ కరోనా సమస్య ఎప్పటికి అదుపులోకి వస్తుందో నిపుణులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. 


ఇలాంటి పరిస్థితులలో భారతీయ జ్యోతిష్య పండితులు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ కరోనా సమస్యకు షష్ఠ గ్రహ కూటమి కారణం అంటూ చెప్పిన విషయాలను వెల్లడిస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించిన ఆసక్తికర కథనం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 2019 డిసెంబర్ లో ఏర్పడిన అరుదైన షష్ఠ గ్రహ కూటమిలో రవి చంద్ర బుధ గురు శని కేతువులు ధనురాశిలో ఉంటూ వీరంతా కలిసి రాహువును వీక్షించడం వల్ల ఈ కరోనా సమస్య ఏర్పడిందని గతంలో ఇలాంటి షష్ఠ గ్రహ కూటమి ఏర్పడినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందని అదేవిధంగా ఇలాంటి షష్ఠ గ్రహ కూటమి ఏర్పడినప్పుడే 1982 చివరిలో ఎయిడ్స్ కు కారణం అయిన వైరస్ వెలుగులోకి వచ్చిందని భారతీయ జ్యోతిష్య పండితులు అభిప్రాయ పడుతున్నారు. 


అదేవిధంగా పాశ్చాత్య దేశాల జ్యోతిష్య సిద్ధాంతులు కూడ ప్రతి 33 నుంచి 38 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శని ఫ్లూటో ల కలయిక వల్ల ఇలాంటి విపత్తులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ కరోనా మహమ్మారి విస్తరణకు గ్రహాల స్టితిగతులలో వచ్చిన మార్పులే కారణం అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.


దీనికితోడు మన తెలుగు సంవత్సరాది అయిన శ్రీ శార్వరి నామ సంవత్సరం కాలసర్ప దోషంతో మొదలు కావడంతో ఈ కరోనా సమస్య మన తెలుగు రాష్ట్రాలను కూడ అతలాకుతలం చేస్తోందని జ్యోతిష్య పండితులు అభిప్రాయ పడుతున్నారు. అయితే వచ్చేనెల మే 15 నుండి గ్రహస్థితులలో వచ్చే మార్పులు వల్ల మనదేశంలో ఈ కరోనా రాక్షసి శాంతిస్తుందని దీనికి కారణం ఆ సమయానికి షష్ఠ గ్రహ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గుతుందని అనేకమంది ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్పిన అభిప్రాయాలను ఆ ప్రముఖ పత్రిక ఆసక్తి కథనంగా ప్రచురించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: