కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంది. సీఎం జగన్ పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారు. రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసినా వారి విషయంలో వైసీపీ చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తుంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఒకరిద్దరు నేతలు మినహా బీజేపీ నేతలపై విమర్శలు చేసే నేతలు అధికార పార్టీలో ఎవరూ లేరు. 
 
బీజేపీ కోరడంతో జగన్పార్టీ సూచించిన అభ్యర్థికి రాజ్యసభ సీటును కేటాయించారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య సఖ్యతను ఒక వర్గం మీడియో ఓర్వలేకపోతుంది. ఆ మీడియా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఏపీలోని బీజేపీ నేతల్లో కొందరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే మరికొందరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 
 
టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్రంలో కలిసి ఉన్న సమయంలో ఒక వర్గం మీడియా మూడు పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చింది. అనంతరం టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జనసేనకు ప్రచారం కల్పించకపోవడం, నెగిటివ్ కథనాలు ప్రచురించడంతో ఒక దశలో జనసేన నాయకులు సైతం ఆ మీడియాపై మండిపడ్డారు. గతంలో బీజేపీని నెత్తిన పెట్టుకున్న ఆ మీడియా టీడీపీ, బీజేపీ విడిపోయిన తరువాత మోదీపై వ్యతిరేక కథనాలు ప్రచారం చేసింది. 
 
అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో ఎవరూ ఊహించని స్థాయిలో వైసీపీ విజయం సాధించడంతో మొదట్లో ఆ వర్గం మీడియా కొంత సైలెంట్ అయింది. అయితే తాజాగా బీజేపీ, వైసీపీకి మధ్య చిచ్చు పెట్టడానికి ఆ వర్గం మీడియా ప్రయత్నిస్తోంది. టీడీపీని బీజేపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేయడంతో ఆ వర్గం మీడియా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. మరి ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో చుడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: