ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని రెడ్ జోన్లలో, ఆరెంజ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. పోలీసులు రెడ్ జోన్లలోకి కొత్తవాళ్లు రాకుండా చర్యలు చేపడుతున్నారు. 
 
కాగా ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గత నెల కీలక నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు నెల వచ్చిన బిల్లునే ఈ నెల చెల్లించాలని సూచించింది. ఆన్ లైన్ ద్వారా ప్రజలకు బిల్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది ఆన్ లైన్ ద్వారా బిల్లు చెల్లించగా లాక్ డౌన్ వల్ల మరికొందరు బిల్లు చెల్లించలేకపోయారు. విద్యుత్ బిల్లు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్లు బిల్లు చెల్లించలేకపోయారు. 
 
కానీ నెల్లూరు, గుంటూరు జిల్లాలలోని పలు మండలాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా బిల్లులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరిలో ఒక్కరికి కరోనా సోకినా వీరి నుంచి వేల మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వీరు కూడా కరోనా వైరస్ భారీన పడే అవకాశం ఉంది. ఒక్కరు వైరస్ భారీన పడినా వారి నుంచి ఎంత మందికి కరోనా సోకుతుందో అంచనా వేయడమే కష్టం. 
 
విద్యుత్ శాఖ అధికారులు సీఎం జగన్ ఆదేశాలను ఉలంఘించి మరీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా బిల్లుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబ సభ్యులు సైతం బిల్లుల వసూలుకు వారిని కరోనా విజృంభిస్తున్న సమయంలో పంపించడంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బిల్లులు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: