రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు తెరవాలనేది ప్రభుత్వం మే 17వ తేదీ తర్వాత ప్రకటించనుందని చండీగర్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విజయేందర్ సింగ్ల గురువారం రోజు చెప్పుకొచ్చాడు. చండీగర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అన్ని కార్యాలయాలు, పాఠశాలలు ఎప్పుడు తెరవాలనేది ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలను వెల్లడించలేదు. మే 17వ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్ని మూసివేసే ఉంటాయని విద్యాశాఖ మంత్రి విజయేందర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి భారతదేశమంతటా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో విద్యాశాఖ కుదేలవుతోంది. చదువుకునే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. టెన్త్ పరీక్షలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ విద్యార్థులు పై చదువులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ గురించి ఆందోళన పడుతున్నారు.


అయితే చండీగర్ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ... కాలేజీలో యూనివర్సిటీలో జూన్ 15 వరకు మూసివేసే ఉంటాయని తెలిపారు. ఒక జిల్లా విద్యాశాఖ ఆఫీసర్ మాట్లాడుతూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి పాఠశాలలో ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతున్నారు. కానీ మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి డైరెక్షన్స్ రాలేదు అని చెప్పుకొచ్చారు. ప్రైవేటు పాఠశాలలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు తెరుస్తారు కానీ కేవలం పుస్తకాలు అమ్మేందుకు మాత్రమే విద్యార్థులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. విద్యార్థులకు బోధించే కార్యక్రమాలు ఇప్పట్లో జరగవని తెలుస్తోంది.


చరిత్రలో మొట్టమొదటి సారిగా వేసవి కాలం సెలవలు మినహాయించి విద్యార్థులకు దాదాపు యాభై రోజుల పాటు సెలవులు రావటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నడంతో... లాక్ డౌన్ నిబంధనలు ఇంకా కొనసాగిస్తారేమోనని పేదవారు, చిన్న వ్యాపారస్తులు, వలస కూలీలు బాగా ఆందోళన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజుల వరకు లాక్ డౌన్ కొనసాగిస్తుందో తెలియాలంటే మే 17 వరకు వేచిచూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: