ఎంత వ‌ద్ద‌నుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు.. సీఎంల మ‌ధ్య పోలిక వ‌స్తూ ఉంటుంది. అక్క‌డ కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఇక్క‌డ జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా రాజ‌కీయ నాయ‌కులు.. మేథావులు.. మీడియా వాళ్లు కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రికి పోలిక తెచ్చేస్తుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్పాటు అయ్యి యేడాది దాటుతోంది. తెలంగాణ లో కేసీఆర్ సీఎం అయ్యి యేడాదిన్న‌ర దాటుతోంది. ఇక ఏపీలో జ‌గ‌న్ సీఎం అయ్యి యేడాది అవుతోంది. యేడాది పాల‌న‌లో ఎవ‌రు ఎలా ?  చేశార‌న్న పోలిక‌తో ఆస‌క్తిక అంశాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

ఇక క‌రోనా ఎప్పుడు అయితే ప్రారంభ మైందో అక్క‌డ కేసీఆర్‌.. ఇటు జ‌గ‌న్ ఇద్ద‌రు ఎవ‌రికి వారు నిర్ణ‌యాలు తీసుకున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు తాము చేశారు. ఇక క‌రోనా ప్రారంభ మ‌య్యాక ముందుగా కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో అంద‌రూ జ‌గ‌న్ కంటే కేసీఆర్ బెట‌ర్ అని.. కోవిడ్ క‌ట్ట‌డిలో ఏపీ కంటే తెలంగాణ ముందుగా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ని మెచ్చుకుంటూ వ‌చ్చారు. అయితే సీన్ ఎప్పుడు అయితే రివ‌ర్స్ అయ్యిందో అప్ప‌టి నుంచి జ‌గ‌న్‌ను పొగ‌డ‌డం ప్రారంభించారు. కేసీఆర్ మోదీ కంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టి లాక్ డౌన్ పొడిగించు కుంటూ వ‌చ్చారు.

 

అయితే జ‌గ‌న్ మాత్రం మ‌ధ్యలో ఇక భ‌విష్య‌త్తులో మ‌నం క‌రోనాతో క‌లిసి ప్రయాణం చేయ‌క త‌ప్ప‌ద‌ని .. క‌రోనా మీకు రావొచ్చు.. నాకు రావొచ్చు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పిన‌ప్పుడు అంద‌రూ న‌వ్వారు. అయితే ఆ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు జ‌గ‌న్ మాట‌కు జై కొట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. లాక్ డౌన్ ప‌దే ప‌దే పొడిగించ‌డం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మంచిది కాద‌న్న విష‌యాన్ని సైతం అంద‌రూ అంగీక‌రించారు. ఇక జ‌గ‌న్ తొలి యేడాదిలోనే ల‌క్ష‌లాది ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా జ‌గ‌న్ బాట‌లో ఫాలో అవుతూ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా క‌రోనా ఉధృతంగా ఉన్న‌ప్పుడు ఫోక‌స్ అంతా కేసీఆర్ మీద ఉండ‌గా.. ఇప్పుడు జ‌గ‌న్ సీన్ పూర్తిగా రివ‌ర్స్ చేసేశార‌నే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: