తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా  కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న విషయంలో  తెలిసిందే. కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతుంది ఈ మహమ్మారి వైరస్. లాక్ డౌన్ కి  ముందు వరకు కాస్త కంట్రోల్ లోనే ఉన్న ఈ వైరస్ ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన నాటి నుంచి రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. మళ్లీ తెలంగాణలో భారీగా కేసులు నమోదు అవుతుండటం తో  ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నగరంలో అయితే వైరస్ విజృంభిస్తుంది అని చెప్పాలి . కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఎంతోమందికి వ్యాప్తిచెందుతుంది ఈ మహమ్మారి. తాజాగా ఒక మటన్ వ్యాపారి కారణంగా ఏకంగా ఎంతోమందికి మహమ్మారి వైరస్ బారిన పడాల్సి దుస్థితి వచ్చింది. 

 


 వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ లో మటన్ వ్యాపారి గెట్ టుగెదర్ పార్టీ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ పార్టీకి హాజరైన వారిలో ఏకంగా 22 మందికి కరోనా  సోకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఇలా కరోనా  సోకినవారిలో ఏకంగా 14 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం గమనార్హం. సదరూ  మటన్ వ్యాపారి కి జియాగూడ లోని బంధువుల ద్వారా ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారని తెలుస్తోంది. ఇక ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. 

 


 అయితే ఆ మటన్ వ్యాపారి వద్ద చాలా మంది ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటారు కాబట్టి ఇంకా ఎంత మందికి వ్యాపించి ఉంటుంది అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు. దీంతో ఎవరెవరు ఆ మటన్ వ్యాపారి వద్ద మటన్ కొనుగోలు చేశారు అనేది ఆరా తీస్తున్నారు. దీంతో చుట్టు పక్కన అన్ని ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు అధికారులు. ముఖ్యంగా జియా గూడా, గౌలిపుర, సంతోష్ నగర్,మహేశ్వరం, బోరబండ హర్షగూడ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు అధికారులు. ఆయా ప్రాంతాలకు ఇంటింటి సర్వే నిర్వహించేందుకు గాను ఏకంగా 40 వైద్య బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: