ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలపై పంజా విసురుతు అతలాకుతలం చేస్తుంది. అయితే చైనాలో గబ్బిలాలు పాములు తినడం కారణంగానే ఈ మహమ్మారి వైరస్ సోకింది అని మొదటి నుంచి చైనా ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బిలాల ద్వారా నే మహమ్మారి వైరస్ సోకింది అనే వాదన బలంగా వినిపిస్తోంది చైనా ప్రభుత్వం. దీంతో గబ్బిలాలను చూస్తేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఈ మహమ్మారి వైరస్ పుట్టిన చైనా దేశంలో మాత్రం ఇప్పటికీ గబ్బిలాలు పాములను తింటూనే ఉన్నారు అక్కడ వాళ్ళు.
అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఉత్తరప్రదేశ్లోని గోరకపూర్ సమీపంలో కుప్పలుతెప్పలుగా గబ్బిలాలు చనిపోవడం సంచలనంగా మారింది. భారీ మొత్తంలో ఒకేసారి గబ్బిలాలు చనిపోవడంతో అక్కడున్న ప్రజలందరూ కరోనా కారణంగానే గబ్బిలాలు భారీ సంఖ్యలో మరణించాయని భావించారు. ఇక ఈ వార్త ఆ నోట ఈ నోట పడి పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో వైద్యులు ఆ గబ్బిలాలు చనిపోయిన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అయితే సాధారణం కంటే అతి ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత ఉండడం కారణంగానే గబ్బిలాలు ఒకేసారి భారీ మొత్తంలో చనిపోయాయి అంటూ ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. ఉష్ణోగ్రత ఏకంగా నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటం... సదరు గబ్బిలాలకు ఎక్కడ తాగునీరు కూడా అందకపోవడంతో గబ్బిలాలు భారీ మొత్తంలో మృత్యువాత పడ్డాయి అని తెలిపారు. ఇక సదరు గబ్బిలాలను పరీక్షల నిమిత్తం వెటర్నరీ ల్యాబ్ కి పంపించారు. అయితే గబ్బిలాల కారణంగా మనిషికి మహమ్మారి వైరస్ సోకుతుంది కానీ ఆ వైరస్ వల్ల గబ్బిలాలు చనిపోవు అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురి కాకుండా వాటిని బతికించడానికి కొన్ని ధాన్యాలు నీళ్ళు పోస్తే వాటిని బతికించిన వాళ్ళం అవుతాము అని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి