పార్టీ వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చడం లేదు సరికదా, పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తిగా పరిపాలనపై ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఆ విషయాలను తప్ప ఏ ఇతర విషయాలను పట్టించుకొన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజల అవసరాలు తీర్చడంపైన,  సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్లకే చేరవేసే విధానంపైన, జగన్ పూర్తిగా దృష్టి పెట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా, ఆఖరికి కష్టకాలంలో  సైతం జగన్ లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్నారు. ఇక నిధులు మొత్తం సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. దీంతో మిగతా అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయి అన్నది నిజం. 

IHG


ఎమ్మెల్యేలకు కేటాయించే నిధులకు ఇంకా మోక్షం లభించలేదు. నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక పార్టీ నేతల్లో సమన్వయం కొరవడి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నా, జగన్ వాటిపై సీరియస్ గా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే అదునుగా తీసుకుని కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండడం పై జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేయాలని తాను ముందుకు వెళుతుంటే, ప్రతిపక్షాలతో సమానంగా సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న తీరు సహించలేకపోతున్నారు. 

IHG

ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు,  నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మరికొంత మందికి నోటీసులు అందే అవకాశం కనిపిస్తోంది. తమ అసంతృప్తి  వినిపిస్తుండటంతో పాటు, పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకుని వాటి పై  దృష్టి పెట్టినట్టు కనిపిస్తోం.ది ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు మరి కొంతమంది నాయకులు అధిష్టానంపై ఈ విధంగా వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని, ఇలాగే వదిలేస్తే పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతుంది అనే అభిప్రాయానికి వచ్చిన జగన్ రఘురామకృష్ణం రాజు తో పాటు, ఆనం రామనారాయణ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ఇద్దరికీ  నోటీసు అందే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: