దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలతో పాటు అధికారులను టెన్షన్ పెడుతున్నాయి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే మాస్క్ విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
శాస్త్రవేత్తలు, పరిశోధకులు మాస్క్ గురించి అనేక పరిశోధనలు చేసి సర్జికల్ మాస్క్‌లు మాత్రమే తుంపర్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయని తేల్చారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఈ మాస్క్‌లు ధరిస్తే మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంట్లో తయారయ్యే మాస్క్ ల గురించి కూడా ఈ బృందం అనేక పరిశోధనలు చేసింది.
ఇంట్లో తయారు చేసిన మాస్క్ లకు కనీసం రెండు, మూడు పొరలు ఉండాలని అప్పుడే అవి వైరస్ సోకకుండా మనల్ని రక్షించగలవని తేలింది. కొన్ని రోజుల క్రితం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్క్‌లు వాడకూడదని.... ఆ మాస్క్‌ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కీలక ప్రకటన చేసింది. శాస్త్రవేత్తలు ఇళ్లలో ఒక పొరతో తయారు చేసుకునే మాస్క్ మాట్లాడినప్పుడు తుంపర్లను అడ్డుకున్నా.. దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లను ఏ మాత్రం ఆపలేవని చెబుతున్నారు.
రెండు పొరలు లేదా మూడు పొరలు ఉన్న మాస్క్‌లను వినియోగించాలని సూచిస్తున్నారు. రెండు పొరలతో తయారు చేసిన మాస్క్‌లు కరోనా వైరస్ సోకకుండా చేయడంలో కొంతవరకు సహాయపడగలవని... మూడు పొరలతో ఉన్న మాస్క్‌లు మరింత బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మాస్క్ ధరిస్తే కరోనా రాదని ఏదో ఒక మాస్క్ ధరిస్తే మాత్రం వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా సోకకుండా మనల్ని మనం సులభంగా రక్షించుకోగలుగుతాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి