ఐపీఎల్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి అనే విషయం తెలిసిందే. టీమిండియా సక్సెస్ ఫుల్  కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ సారథ్యంలో ఉన్న ఈ జట్టు ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య  రంగంలోకి దిగి చివరికి లీగ్ మ్యాచ్ లతోనే సరిపెట్టుకుంటుంది . ఈసారి మాత్రం తమ జట్టు  ఎంతో బలంగా ఉందని తప్పక టైటిల్ గెలుస్తామని  అంటూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు జట్టు  యాజమాన్యం. కానీ భారత మాజీ క్రికెటర్ ఆకాష్  చోప్రా  మాత్రం బెంగళూరు జట్టుకు బలహీనతలు అలాగే ఉన్నాయి అంటూ బాంబు పేల్చాడు.



 సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 21వ తేదీన సన్రైజర్స్ జుట్టుతో మొదటి మ్యాచ్ ఆడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గత  సీజన్ లో  బౌలింగ్ బలహీనత కారణంగా బెంగళూరు జట్టు ఎక్కువగా రాణించలేకపోయిన  విషయం తెలిసిందే. ఎంతో  విజయవంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. పాయింట్ల పట్టికలో అట్టడుగున  నిలిచింది బెంగళూరు జట్టు. అయితే ప్రస్తుతం సరికొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని మరింత బలాన్ని పెంచుకుంది . ప్రస్తుతం తమ జుట్టు ఎంతో  సమతూకంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చెప్పుకొచ్చాడు.



 కాగా ఇటీవలే యూట్యూబ్ ఛానల్ లో బెంగుళూరు  జట్టు గురించి మాట్లాడిన భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సిబి జట్టు కి ప్రతి సీసన్ లో ఉండే  అతి పెద్ద సమస్య డెత్ ఓవర్లలో బ్యాటింగ్ బౌలింగ్ అని చెప్పుకొచ్చాడు. చివరి వరకు విరాట్ కోహ్లీ, ఏపీ డివిలియర్స్ ఔట్  కాకుండా బ్యాటింగ్ చేస్తే పర్లేదు కానీ వీరిద్దరూ అవుట్ అయితే మాత్రం.. మ్యాచ్  పరిస్థితి క్లిష్టంగా మారిపోతుందని అన్నారు ఆకాష్ చోప్రా. కాగా ప్రస్తుతం మరోసారి బెంగళూరు జట్టు బలహీనంగానే ఉందని అంటూ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: