ప్రజాప్రయోజనాలే  లక్ష్యంగా సాగే వృత్తి జర్నలిజం. కానీ ఈరోజుల్లో అంత సీన్ లేదనుకోండి.. కానీ.. ఏ పత్రిక, ఏ ఛానల్‌ ఏ పార్టీ కొమ్ముకాసినా.. ఎంత పక్షపాతం చూపించినా.. అది అన్ని వార్తల్లోనూ ఉండదు. రాజకీయాల విషయంలో పక్షపాతం చూపించినా... సదరు పత్రికల ద్వారా చాలా మంచి కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే పత్రికలు, ఛానళ్లు అంటే అన్నీ రాజకీయ వార్తలే కాదు కదా. అందువల్ల ప్రజలకు ఉపయోగపడే కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా.. అది అంతిమంగా ప్రజలకు మేలు చేస్తుంది.

అయితే.. తమ పత్రిక, ఛానల్ వల్ల ఏదైనా ప్రజలకు మేలు జరిగినా.. ప్రభుత్వాలు స్పందించినా.. ఆ విషయాన్ని కూడా సదరు పత్రికలు, ఛానళ్లు తమ ప్రమోషన్‌ లో భాగంగా ఆ విషయాలను ప్రస్తావిస్తుంటాయి. మా కథనానికి స్పందన... మా ఛానల్ ఎఫెక్ట్.. అంటూ చెప్పుకుంటాయి. అది తప్పు కూడా కాదు.. ఇది అన్ని పత్రికలు, ఛానళ్లు చేస్తున్న పనే.. అయితే ఆంధ్రజ్యోతి ప్రమోషల్ తీరు మాత్రం కాస్త వింతగా కనిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. సీఎం జగన్ నోట.. ఆంధ్రజ్యోతి మాట అంటూ ఆంధ్రజ్యోతి వెబ్‌ సైట్ ఓ వార్త రాసింది. ఆ హెడ్డింగ్ చదివితే.. జగన్ ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడి ఉంటారేమో అనిపించడం సహజం. జగన్ ఆంధ్రజ్యోతి గురించి ఏం మాట్లాడారా అని ఆ వార్త క్లిక్ చేసి చూస్తే.. జగన్ ఆంధ్రజ్యోతి గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ పత్రికను ప్రస్తావించనేలేదు.. మరి ఆ హెడ్డింగ్ ఏంటి అంటారా.. అంతకు ముందు ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిందట. ఇప్పుడు జగన్ కూడా గడ్కరీతో అదే అంశం గురించి మాట్లాడారట.

అంతే.. ఆంధ్రజ్యోతి చూశారా.. మేం చెప్పిందే జగన్ మాట్లాడారు అంటూ.. తన ప్రమోషన్ మొదలు పెట్టింది. చాలా అంశాల గురించి  మాట్లాడుతూ ఉంటారు. అవే అంశాలు పత్రికలు రాస్తాయి. అంత మాత్రాన సీఎం ఆ పత్రిక కథనం గురించే మాట్లాడినట్టు చెప్పుకోవడమేనా.. ఇదేం జర్నలిజం అంటూ ఆశ్చర్యపోతున్నారు పాత్రికేయ జనాలు. అంతే.. ఇది ఆర్కే మార్కు జర్నలిజం కావచ్చని సర్ది చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: