ఈ మధ్య కాలంలో ఏకంగా రోజులు కూడా నిండని చిన్నారుల పాలిట కన్న తల్లిదండ్రులే శాపంగా మారుతున్న విషయం తెలిసిందే. కనీసం జాలి దయ లేకుండా నెలలు కూడా నిండని చిన్నారి  పసికందులను రోడ్డుమీద అమానుషంగా వదిలేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక ముక్కు పచ్చలారని చిన్నారులు రోడ్డు మీద.. ముళ్ళ పొదల్లో కనిపిస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.



 అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారిని కన్నతల్లి రోడ్డు పాలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి ఏకంగా కఠిన నిర్ణయం తీసుకొని పసికందును రోడ్డుమీద వదిలేసింది. ఇక ఇలా ముక్కుపచ్చలారని పసికందును రోడ్డు మీద వదిలేసి తల్లి ప్రేమకే కళంకం తెచ్చింది సదరు మహిళ. ఈ దారుణ ఘటన భాగ్య నగరం నడిబొడ్డులో చోటుచేసుకుంది. నెలన్నర వయసున్న చిన్నారిని గుర్తు తెలియని మహిళ రోడ్డు వదిలివెళ్లిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మూసాపేట్ నుంచి కైతలాపూర్ వెళ్లే దారి లో ఉన్నటువంటి పెట్రోల్ బంకు వద్ద ఓ పసిపాప కనిపించింది.



 గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని మహిళ నెలన్నర పసిపాపను అలా అక్కడ వదిలి వెళ్లినట్లు కొంతమంది స్థానికులు తెలిపారు. ఇక స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పసిపాపను చేతుల్లోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఇక నెలన్నర వయసు ఉన్న ఆ పసిపాపను మహిళా పోలీసులు శుభ్రం చేసి కొత్తబట్టలు వేశారు. అంతేకాదు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి పెద్దమనసు చేసుకుని ఆ పసిపాపను చేరదీసి ఇందిరా అని నామకరణం చేశారు. ఇక అంతే కాదు పసిపాప యోగక్షేమాలు చూసేందుకు శిశు విహార్ కి ఆ చిన్నారిని అప్పగించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: