ప్రస్తుతం దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే . ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు పాటించినా కూడా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. వెరసి రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా  వైరస్ సోకి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు పోవడం ఏమో కానీ ఎంతో మంది దుర్భరస్థితిలో కి వెళ్ళిపోయారు.




 ఎంతో గౌరవంగా బ్రతికినవారు సైతం ఉపాధి కోల్పోయి దుర్భరస్థితిలో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ కూడా ఎంతో మంది జీవితాలు ఉపాధి కోల్పోయి దుర్భర స్థితి లోనే కొట్టుమిట్టాడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో లెక్చరర్ ఉపాధ్యాయుడిగా పని చేసిన ఎంతోమంది విద్యాసంస్థలు మూతపడడంతో ఉపాధి కరువై చివరికి దుర్భర స్థితికి చేరి పోయారు. ఇక్కడ ఓ లెక్చరర్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన లెక్చరర్ కాస్త గొర్రెల కాపరి గా మారిపోయాడు.



 కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని హల్లిగడ్డ  గ్రామానికి చెందిన  ఓ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తూ ఉండేవాడు. ఇక ఇటీవలే కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు అన్ని మూతపడడంతో అతనికి పూర్తిగా ఉపాధి కరువైంది. కొన్ని రోజుల వరకు కాలేజీలు తెరుచుకుంటాయి అని ఎంతో ఆశగా ఎదురుచూశాడు.  కానీ కళాశాలలు  తెరుచుకోకపోవడంతో తన కుటుంబంలోని తొమ్మిది మందిని పోషించేందుకు గొర్రెల కాపరి గా మారి రోజూ 200 రూపాయలను సంపాదిస్తున్నాడు.  అతని భార్య పత్తి తీతకు వెళ్లి 150 రూపాయలు సంపాదిస్తుంది. కాగా ప్రభుత్వం తమలాంటి పేదలను ఆదుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: