కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతోమంది సంక్షోభంలో కూరుకుపోయే ఆర్థికంగా చితికిపోయి కనీసం కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని దుస్థితి అనుభవించారు ఎంతో మంది పేద ప్రజలు. ఇక కరోనా వైరస్ కారణంగా అన్ని కంపెనీలు కూడా మూతపడడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనీసం నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దీనస్థితిలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని దేశ ప్రజలందరికీ అండగా ఉండే విధంగా రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే.



 కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయి ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్నో పేద కుటుంబాలకు రేషన్ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందించడంతో పాటు పలు రకాల సరుకులను అందించి... పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల  నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఉచితంగానే దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అందుతున్నాయి. అయితే వచ్చే నెల నుంచి మాత్రం ప్రజలందరూ రేషన్ బియ్యానికి డబ్బులు కట్టక తప్పదు అన్నది మాత్రం అర్థమవుతోంది.



 ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం కడుగు ఈ నెలాఖరుతో ముగియనున్నది . మళ్లీ గడువు పొడిగించే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఇక వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరూ కిలో  బియ్యానికి ఒక రూపాయి చొప్పున చెల్లించి రేషన్ బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారభద్రత అంత్యోదయ కార్డుదారులకు పాత కోట  కిందనే రేషన్ బియ్యం  అందించనున్నారు. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా 10 కేజీల బియ్యం ఇవ్వనున్నారు. అయితే ఈ ఉచిత బియ్యం సదుపాయాన్ని మరికొన్ని రోజులు కొనసాగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: