ఇప్పటికీ కూడా కూతురు పెళ్లి ని భారంగా భావిస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. ఇక్కడ ఓ తల్లి ఇలాగే భావించింది. తన కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నది మహిళ. కూతురికి పెళ్లి చేయడం కోసం ఎన్నో పెళ్లి సంబంధాలు కూడా చూసింది. కానీ ఒక్క సంబంధం కూడా సెట్ కావడం లేదు. దీంతో తమ చుట్టుపక్కల ఉన్న అందరూ యువతులకి పెళ్లి జరుగుతుంది కానీ తమ కూతురికి పెళ్ళి జరగడం లేదు అని మనస్థాపం చెందినది సదరు మహిళ. చివరికి కఠిన నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కూతురికి పెళ్లి కుదరడం లేదు అని మనస్థాపానికి గురైన మహిళ కఠిన నిర్ణయం తీసుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని వాసవి నగర్ కు చెందిన చింతల శ్రీమతి అనే 48 ఏళ్ల మహిళ తన కూతురికి పెళ్లి చేయడానికి ఎన్నో సంబంధాలు చూసింది కానీ పెళ్ళి మాత్రం కుదరడం లేదు. దీంతో తన కూతురికి పెళ్లి కుదరడం లేదు అనే కారణంతో మనస్థాపం చెందింది సదరు మహిళ. కొన్ని నెలలుగా మానసిక ఆందోళన లో మునిగి పోయిన సదరు మహిళ ఇటీవలే సమీపంలోని బంగ్లా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే మృతదేహం బయటపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి