ప్రస్తుతం నేడు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతున్న నేపథ్యం లో... గ్రేటర్ పరిధి లో వాతావరణం మొత్తం హాట్ హాట్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇన్ని రోజుల వరకు గ్రేటర్ పరిధి లో ముమ్మర ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నిక లో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకొని ప్రచార రంగం లో దూసుకు పోయి ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మరింత ఆసక్తికరం గా మారింది.



 ప్రజలందరూ ఏ పార్టీకి ఓటు వేసి గెలిపించబోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం అభ్యర్థులందరిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు... పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు యాభై వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల పరిధిలో వాతావరణం మొత్తం హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే.



 ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. అయితే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ బూతులు చెక్పోస్టుల వద్ద కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. గ్రేటర్ లో ఎక్కడ చూసినా కూడా అడుగడుగునా పోలీసులు మోహరించారు. దీంతో ప్రస్తుతం నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. ఇక పోలీసులు ప్రస్తుతం నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: