హైదరాబాద్: నూతన ఎక్సయిజ్ విధానాన్ని నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు రాష్ర్ట వ్యాప్తంగా మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎక్కడికక్కడ సీపీఐ నాయకులను, కార్యర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. అనేక జిల్లాలో సీపీఐ ఆందోళనలు కొనసాగాయి. ఆందోళనకారులకు, పోలీసుల మధ్యన తోపులాటలు జరిగాయి. ఈ ఆందోళన సంగారెడ్డి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.  లాటరీ ప్రక్రయను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలని కూడా చూడకుండా సంగారెడ్డి సీఐ హరిశ్చంద్రారెడ్డి చెయ్యి చేసుకున్నట్లు సీపీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. సీఐ హరిశ్చంద్రారెడ్డి ఆందోళనకారులపై ఓవరాక్షన్ చేశాడనీ, ఆయన వల్ల పలువురు సీపీఐ కార్యకర్తలు, మహిళలకు గాయాలు తగిలినట్లు చెప్పారు. సీఐ తీరుకు నిరసనగా ఈ నెల 27న సంగారెడ్డి బంద్కు సీపీఐ పిలుపునిచ్చింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, అకారణంగా తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ సీఐపై చర్యలు తీసుకోవాలనీ సీపీఐ డిమాండు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: