అంతేకాదు.. నెల్లిమర్ల వ్యాప్తంగా బొత్స చైతన్య బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనాయుడికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో అప్పలనాయుడు, లక్ష్మణరావులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లూ ఒకే మాటపై నడిచిన బొత్స కుటుంబ సభ్యులు ఇప్పుడిలా ప్రత్యర్థుల్లా మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో అనే సమస్యలను పరిష్కరించిన మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ సమస్య తలనొప్పిగా మారిందని అంటున్నారు. మరోవైపు.. బొత్స తన సతీమణికి మరోసారి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎంపీగా చేసిన ఝాన్సీ.. ప్రస్తుతం బొత్స వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ టికెట్‌ను ఆమెకుకేటాయించాలంటూ.. ఇప్పటికే బొత్స.. ఓ ప్రతిపాదన పెట్టారని సమాచారం.
దీంతో మొత్తంగా కుటుంబంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయం పెద్ద రగడగా మారిందనే సమాచారం జిల్లాలో హల్‌చల్ చేస్తోంది. అసలు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం.. అప్పుడే టికెట్ల కోసం వీరు పోటీ పడుతుండడం వైసీపీ సీనియర్లు కూడా ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నారని.. వేరే వారికి అవకాశం లేకుండా చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి