ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయంగా కూడా వీటిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా సరే నేరాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. సిఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకుని దిశా చట్టాన్ని తీసుకొచ్చినా ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్య  కేసు లో నిందితుడు అరెస్టు అయ్యాడని  గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు వివరించారు.

డిగ్రీ విద్యార్థిని అనూషను సహ విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి హత్య చేశాడు అని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని ఆయన అన్నారు. అందుకే కేసు విచారణ త్వరితగతిన చేపట్టాం అని ఆయన పేర్కొన్నారు. అనూషకు వేరే యువకునితో చనువుగా ఉందని విష్ణుకి అనుమానం వచ్చింది అని, 24 వ తేదీ ఉదయం అనూషను నరసరావుపేట శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు అని వివరించారు. అనూషను నిలదీయటంతో పాటు గొడవ పడ్డాడు అని ఆయన పేర్కొన్నారు. కోపంలో అనూషను గొంతు నులుమి చంపాడు అని తెలిపారు.

హత్య తర్వాత సాక్ష్యాదారాలు లేకుండా చేయాలని చూశాడు అని ఆయన పేర్కొన్నారు. హత్యకు సంబంధించి ఆధారాలు శాస్త్రీయంగా సేకరించాం అని ఆయన అన్నారు. హత్య కేసులో ముద్దాయికి శిక్ష పడేలా చూస్తాం అని అన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతాం అని ఆయన పేర్కొన్నారు.  మహిళలు, యువతులు ఇలాంటి సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి అని వివరించారు. నా వాట్సప్ నంబర్ 9440796200 కు కూడా ఫిర్యాదు చేయొచ్చు అని ఆయన నెంబర్ ఇచ్చారు. పోలీసు హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబరు 8866268899 అని తెలిపారు. ఏ సమస్య వచ్చిన వాట్సాప్ లో మెసేజ్ చేస్తే స్పందిస్తాం అని ఆయన పేర్కొన్నారు. అనూష కేసుని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: