ఎలాంటివారైనా చనిపోయాక మాత్రం వారిని మంచివారిగా కీర్తించి సంతాపం తెలపడం సాంప్రదాయంగా వస్తోంది. ఇంకా సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం కూడా పాటిస్తాం. అయితే ప్రపంచంలోనే మొదటి సారి సంతాపం తెలిపింది మాత్రం బ్రిటన్ దేశంలోనే. మొదటి ప్రపంచయుద్ధంలో చనిపోయిన సైనికులను స్మరిస్తూ నవంబర్ 11, 1919న... ఉదయం 11 గంటలకు తొలిసారిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆ సంతాపమే ప్రపంచంలో మొదటిదిగా గుర్తించారు. ఆదివారంనాటికి ఆ సంతాపానికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. అందులో కూడా మొదటగా దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న అప్పటి బ్రిటీష్ హై కమిషనర్ సర్ పెర్సీ ఫిట్‌పావూటిక్ తన కుమారుడి మరణించడానికి సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించాడు. పాట్రిక్ కొడు కు 1917లో ఫ్రాన్స్‌లో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. తన కొడుకులాంటి ఎందరో సైనిక వీరులు దేశం కోసం ప్రాణాలర్పించారు. వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని పిలుపునిచ్చాడు. అప్పటి నుంచి నవంబర్ 11న బ్రిటన్ ప్రజలంతా రెండునిమిషాలు మౌనం పాటించి.. అమరవీరులను స్మరించుకుంటున్నారు. ఆ తర్వాత ప్రపంచమంతా సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ.. మృతులకు నివాళులు అర్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: