పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన భార్యాభర్తల మధ్య కలహాలు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలను వేలెత్తి చూపడం వలన గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. మనస్పర్థలు కాస్త అనుమానానికి దారి తీసి చంపడమో, లేదా ఆత్మహత్యలకు పాల్పడటమే వంటివి చేస్తున్నారు. మరికొంత మంది విడాకులు టీయూసుకొని ఎవరిని జీవితాన్ని వాళ్ళు లిడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న గొడవలు కొన్ని సార్లు మనసుకి సంతోషాన్ని కలిగిస్తే.. కొన్ని సార్లు అవే అనేక దారుణాలకు దారి తీస్తుంటాయి.

అయితే తరచూ భార్యతో గొడవ.. ఇంటికొస్తే చాలు రోజు పేచీనే. దీంతో ఆమె తీరుతో విసుగు చెందాడు. అయినా కూడా ఆ భర్త పుట్టింటికి వెళ్లిన భార్యను పిలిచి కలిసి ఉందామని ప్రేమగా కోరాడు. కానీ ఆమె వినిపించుకోకుండా మళ్లీ గొడవకు దిగింది. ఆమెతో వాదించడమే వేస్ట్‌.. అని భావించి ఇక ఆమెతో వాదన దిగకుండా ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు ఆ భర్త. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌ జిల్లా గోపాల్‌పూర్‌ గ్రామంలో నిషా, ముకేశ్‌ భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే భార్య కొన్ని రోజులుగా భర్తతో గొడవపడుతోంది. దీంతో విబేధించి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం భార్యకు ఫోన్‌ చేసి ముకేశ్‌ పిలుపించుకున్నాడు. వచ్చాక మళ్లీ కలిసి జీవించుదామని కోరాడు. అయితే ఆమె అప్పుడు కూడా గొడవ పెట్టుకుంది. దీంతో అతడు విసుగు చెంది వెంటనే బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు లబోదిబోమన్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని కాన్పూర్‌లోని పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: