రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. దీంతో ప్రజలు అందరిలో ఆందోళన మొదలైంది.  మొన్నటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉందని ఇక దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చుకుంది.  ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రించడంలో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. అదే సమయంలో ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఇక దేశ ప్రజానీకం లో మొత్తం దైర్యం నిండి పోయింది అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం అంతకుమించి అనే రేంజ్ లో వైరస్ వ్యాప్తి చెందడంతో అందరూ బేంబేలెత్తిపోతున్నారు.



 ముఖ్యంగా ఇక అటు ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.  నోరు ముక్కు కళ్ళు లాంటివి వైరస్ ప్రధాన వాహకాలుగా మారిపోతున్నాయి తరచూ చేతులను ముక్కు లేదా నోరు కళ్ళు లాంటి వాడి దగ్గర తాకడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల ఇక చేతులపై వైరస్ ఉంటే అది వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా నోటి ద్వారా అయితే మరింత ఎక్కువగా ముప్పు ఉంటుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే ఎప్పుడూ నోటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుంది అని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.



 ముఖ్యంగా చిగుళ్ల వ్యాధులు ఉన్నవారిలో బయటినుంచి నోట్లో కి చేరిన కరోనా వైరస్ ఆ తర్వాత లాలాజలం సహాయంతో రక్తం లోకి వెళ్లి ఇక అక్కడినుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పూర్తిగా ఆరోగ్యం క్షీణించే విధంగా చేస్తుంది అని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపారు. అయితే వాయునాళాల తో పోలిస్తే ఇలా నోటి ద్వారానే ఎక్కువగా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు వైద్యనిపుణులు. అందుకే కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా మౌత్ వాష్లు వాడటం ఎప్పుడూ నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ఉప్పునీటితో పుక్కిలించడం లాంటివి చేస్తూ ఉండాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: